సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..!

కలం, వెబ్ డెస్క్ : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి బిగ్ రిలీఫ్ దక్కింది. తన ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై సీబీఐ, ఈడీ విచారణ జరపాలంటూ అలహాబాద్ హైకోర్టు చేసిన ఉత్తర్వులపై రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణను చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.

ఈ మేరకు అలహాబాద్ కోర్టు (Allahabad Court) సీబీఐ, ఈడీ దర్యాప్తు ఆదేశాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికి రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆస్తులపై విచారణ జరపకూడదని దర్యాప్తు సంస్థలను ఆదేశించింది. అంతేకాదు రాహుల్ గాంధీకి కనీసం వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా దర్యాప్తు సంస్థలకు ఎలా ఆదేశాలు ఇస్తారని అలహాబాద్ హైకోర్టును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ పిటిషన్‌పై ఆయనపై పిటిషన్ వేసిన ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రాహుల్ గాంధీ వేసిన తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.

Also Read : కావేరి జల వివాదం.. సుప్రీంకోర్టులో కర్ణాటక ప్రభుత్వానికి షాక్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>