బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్ది ఓ జోక‌ర్‌: మంత్రి టీజీ భ‌ర‌త్‌

క‌లం, వెబ్‌డెస్క్‌: వైసీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై టీజీ భరత్ (TG Bharat) సంచలన వ్యాఖ్యలు చేశారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి (Byreddy Siddhartha Reddy) ఓ జోకర్ అని, ఆయ‌న పిట్ట క‌థ‌లు చెప్తాడ‌నే వైసీపీ వాడుకుంటుంద‌ని విమ‌ర్శించారు. 2014 నుంచి బైరెడ్డి రాజ‌కీయాల్లో ఉన్నాడ‌ని, అప్పుడు ఆయ‌న‌కు టికెట్ ఎక్క‌డా రాలేద‌ని అన్నారు. 2019లో, 2024లో కూడా టికెట్లు రాలేద‌ని చెప్పారు. వైసీపీ ఆయ‌న‌ను కేవ‌లం అవ‌స‌రానికి వాడుకుంటుంద‌ని చెప్పారు. ఆయ‌న అన్ని చోట్లా జోక‌ర్‌లా మాట్లాడ‌తార‌ని, అయితే క‌ర్నూలులో వ‌చ్చి త‌న గురించి మాట్లాడ‌టం స‌రికాద‌ని హెచ్చ‌రించారు. త‌మ కుటుంబం ఎలాంటిదో అంద‌రికీ తెలుసున‌ని, ఏరోజు త‌మ‌పై అవినీతి ఆరోప‌ణ‌లు లేవ‌ని అన్నారు.

ఇక క‌ర్నూలు వ‌చ్చి త‌న‌పై అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తే జోక్‌లాగానే ఉంటుంద‌ని టీజీ భ‌ర‌త్‌ (TG Bharat) అన్నారు. సిద్దార్థ్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై కోర్టులో పిటిష‌న్ వేస్తాన‌న్నారు. ఎందుకు అన‌వ‌స‌ర‌పు ఆరోప‌ణ‌లు చేశానా అని సిద్ధార్థ్ రెడ్డి అనుకునేలా చేస్తాన‌న్నారు. ఆయ‌న ఒక జోక‌ర్ కాబ‌ట్టే ఆయ‌న‌కు పార్టీ టికెట్ ఇవ్వ‌డం లేద‌న్నారు. చిన్న వ‌య‌సులోనే సిద్ధార్థ్ రెడ్డి జైలుకు వెళ్లాడ‌ని, మ‌ర్డ‌ర్ కేసులో ఇరుక్కున్నాడ‌ని అన్నారు. ఇన్నాళ్లూ ఆయ‌న నోటికొచ్చిన‌ట్లు మాట్లాడితే ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని, ఇప్పుడు మాత్రం ఊరుకునే ప‌రిస్థితే లేద‌న్నారు. క‌ర్నూలులో పెట్టుబ‌డుల కోసం ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నామ‌ని, ఇలాంటి త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తే చ‌ట్ట‌ప‌రంగా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు.

Read Also: భానుడి భగభగల వేళ.. వాతావరణ శాఖ చల్లని కబురు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>