కలం, వెబ్ డెస్క్ : తాను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలాంటి ఇగోలకు వెళ్లకుండా పని చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తెలిపారు. రాజకీయంగా, పరిపాలనా పరంగా ఎలాంటి ఇగోలు లేకుండా ప్రజల కోసం పని చేస్తున్నామని ఆయన వెల్లడించారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ – 2025 అవార్డు వచ్చినందుకు మంత్రులు, హెచ్ఓడీలు, సెక్రటరీలకు చంద్రబాబు నాయుడు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు.
అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో ‘డిన్నర్ విత్ ది రియల్ విన్నర్స్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. తాము ఎలాగైతే ఇగో లేకుండా పని చేస్తున్నామో అధికారులు కూడా అదే విధంగా ప్రజలకు ఇగో లేకుండా సేవలు అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అలాగే, రాజకీయాల్లో ఎన్నో విజయాలు చూశానని, కానీ, 2024 ఎన్నికల్లో వచ్చిన గెలుపు గతంలో ఎప్పుడూ చూడలేదని ఆయన వెల్లడించారు.

