కలం, వెబ్ డెస్క్: దిల్లీ హైకోర్టులో (Delhi High Court) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ ఒక కేసు వర్చువల్ విచారణలో భాగంగా అసభ్యకర వీడియోలు ప్లే అయ్యాయి. దీంతో విచారణను నిలిపేసిన సీజే.. మరికాసేపటి తరువాత మరోసారి విచారణ తిరిగి ప్రారంభించారు. ఈ సారి ఏకంగా పోర్న్ వీడియోలే దర్శనం ఇవ్వడంతో అంతా షాకయ్యారు. ఇలా రెండు సార్లు జరగడంతో జడ్జిలంతా తీవ్ర ఆందోళన చెందారు. అసలు ఏం జరుగుతుందో కూడా వారికి అర్థం కాలేదు. అనంతరం, కొన్ని సెకన్ల తరువాత స్క్రీన్ పై మీరు హ్యాకయ్యారు అంటూ ఒక మెసేజ్ రావడం గమనార్హం.
హ్యాకర్ల పనేనా..?
చీఫ్ జస్టిస్ వర్చువల్ విచారణ లింకులోకి హ్యాకర్లు ప్రవేశించడమే కాకుండా.. ఏకంగా పోర్న్ వీడియోలు ప్లే చేయడంతో హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని రిజిస్ట్రార్ జనరల్ ను ఆదేశించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ జరుపుతున్నారు.

