కలం వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) అయోధ్య(Ayodhya)లో బాల రాముడిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం అయోధ్యకు చేరుకున్న చంద్రబాబుకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. ఈరోజు అయోధ్యలో దివ్యమైన శ్రీరామ జన్మభూమి మందిరంలో దర్శనం చేసుకొని ప్రార్థనలు చేసుకోవడం ఎంతో భాగ్యంగా భావిస్తున్నానన్నారు. ఇక్కడికి రావడం ఎంతో శాంతిని ఇవ్వడంతో పాటు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని కలిగించిందని తెలిపారు. శ్రీరాముడి విలువలు, ఆదర్శాలు కాలాతీతమైనవని, మనందరికీ అవే శాశ్వత మార్గదర్శకాలని పేర్కొన్నారు. ఆ విలువలు, ఆదర్శాలు ఎల్లప్పుడూ అందరికీ ప్రేరణనివ్వాలని కోరారు.
Read Also: సామాన్యులను భయపెట్టేలా చంద్రబాబు పాలన : పేర్ని నాని
Follow Us On: X(Twitter)


