గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

కలం, వెబ్‌డెస్క్: స్వల్ప అస్వస్థత కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌ (Abdul Nazeer) ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పరామర్శించారు. లోక్ భవన్‌కు వెళ్ళిన సీఎం చంద్రబాబు ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

కాగా శనివారం ఉదయం గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడటంతో రాజ్‌భవన్‌ సిబ్బంది వెంటనే స్పందించి, గవర్నర్‌ను విజయవాడ తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.

Read Also: పార్ట్‌నర్ నచ్చకపోతే శరీరం తిరుగుబాటు చేస్తుందా..? కొందరు మహిళల అనుభవాలు ఏం చెప్తున్నాయంటే..

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>