Mobile Popup Ad
Mobile Popup Ad

పార్ట్‌నర్ నచ్చకపోతే శరీరం తిరుగుబాటు చేస్తుందా..? కొందరు మహిళల అనుభవాలు ఏం చెప్తున్నాయంటే..

కలం, వెబ్​ డెస్క్​ : మన శరీరానికి ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు అలసట, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని మనందరికీ తెలుసు. సాధారణంగా ఇవి మనం తినే ఆహారం, మన పరిసరాలను బట్టి ఉంటాయి. అయితే, మనం ఉండే బంధం సరిగ్గా లేకపోయినా (Toxic Relationships) మన శరీరం వింత వింత సంకేతాలను పంపిస్తుందని తాజా పరిశోధనలు, సోషల్ మీడియా చర్చలు చెబుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో వచ్చే మార్పులు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

సోషల్ మీడియాలో మొదలైన చర్చ

సెల్ఫ్-లవ్, రిలేషన్‌షిప్ కంటెంట్ క్రియేటర్ లెక్స్ హాఫ్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. తమకు నచ్చని లేదా తమకు ఇబ్బంది కలిగించే వ్యక్తులతో డేటింగ్ చేసినప్పుడు వారి శరీరం ఎలా స్పందించిందో చెప్పమని ఆమె కోరారు. దీనికి స్పందనగా దాదాపు 5,000 మంది మహిళలు తమ విస్తుపోయే అనుభవాలను పంచుకున్నారు.

ఇన్ఫెక్షన్లు : చాలా మందికి తరచుగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ (UTI), ఇతర ప్రైవేట్ భాగాల్లో ఇన్ఫెక్షన్లు వచ్చాయని, బ్రేకప్ అయిన వెంటనే అవి మాయమయ్యాయని తెలిపారు.

రుతుక్రమ సమస్యలు : ఒక మహిళ తన పీరియడ్స్ ఏకంగా నాలుగు ఏళ్ల పాటు ఆగిపోయాయని, విడిపోయిన తర్వాత మళ్ళీ సాధారణ స్థితికి వచ్చాయని చెప్పారు. మరో మహిళకు ఆరు నెలల పాటు ఆగకుండా పీరియడ్స్ అయ్యాయని పేర్కొన్నారు.

వింత ప్రవర్తన: ఒక వ్యక్తి తన పార్ట్‌నర్ ఇంట్లో ఉన్నప్పుడు నిద్రలో నడవడం (Sleep Walking) మొదలుపెట్టానని, విడిపోయాక అది ఆగిపోయిందని చెప్పారు.

తీవ్రమైన జబ్బులు: విపరీతమైన ఒత్తిడి వల్ల క్యాన్సర్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వంటి ప్రాణాంతక సమస్యలు ఎదుర్కొన్నామని కొందరు వాపోయారు.

మానసిక మార్పులు :

కేవలం శారీరక వ్యాధులే కాకుండా, మానసికంగా కూడా అనేక మార్పులు వచ్చినట్లు వారు తెలిపారు. కొంతమందికి విపరీతమైన కోపం, డిప్రెషన్ రాగా, మరికొందరికి ఆందోళన (Anxiety) వల్ల పానిక్ అటాక్స్ వచ్చాయని వివరించారు.

మరికొన్ని వింత సంఘటనలు

ఒక మహిళ తన పెళ్లి ఉంగరం పెట్టుకుంటే చేతికి పొక్కులు రావడం మొదలైందని, విడాకుల తర్వాతే అది తగ్గిందని చెప్పారు. మరొకరు తన పార్ట్‌నర్ తాకితే ఒళ్లు జిడ్డుగా మారుతున్నట్లు అనిపించి, రోజుకు మూడు సార్లు స్నానం చేసే అలవాటు చేసుకున్నట్లు తెలిపారు.

శరీర భాషను గుర్తించండి..

సినిమాలు, పాప్ కల్చర్ తరచుగా విషపూరితమైన బంధాల (Toxic Relationships)ను అందంగా చూపిస్తుంటాయి. దీనివల్ల చాలామంది తప్పుడు ప్రవర్తనలను కూడా సహజమని అనుకుంటారు. కానీ మన మనస్సు ఒప్పకోకపోయినా, శరీరం మాత్రం నిజం చెబుతుంది. జీర్ణక్రియ సమస్యలు, నిద్రలేమి లేదా చర్మ సమస్యలు ఇలా ఏదైనా సరే.. మన శరీరం ఇచ్చే హెచ్చరికలను గమనించడం ఎంతో ముఖ్యం.

ఆరోగ్యకరమైన సంబంధాలు మనకు ప్రశాంతతను ఇవ్వాలి కానీ, నిరంతర ఒత్తిడిని కాదు. ఈ అనుభవాలు మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. మన శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను అర్థం చేసుకుని సరైన నిర్ణయాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Read Also: రీల్స్ క్రేజ్ : ప్రాణాలు కోల్పోతూ.. ఇతరుల ప్రాణాలు తీస్తున్న యూత్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>