కలం, వెబ్ డెస్క్ : సంక్రాంతి సంబరాల నేపథ్యంలో ఏపీలోని ఊర్లన్నీ వెలిగిపోతున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. నారావారి పల్లెలో సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ‘కూటమి పాలనలో పల్లెలకు శోభ తీసుకువచ్చాం. సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు తగ్గించేలా ప్రణాళికలు రెడీ చేస్తున్నాం‘ అంటూ చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు.
యువతకు ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని.. ఈ ఏడు సంక్రాంతి పండుగ వరకు అనేక కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టినట్టు సీఎం చంద్రబాబు (Chandrababu) చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఏపీలోని ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామని.. ఇండ్లు లేని వారు ఉండొద్దనేదే తమ ఉద్దేశం అని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందాలన్నదే తమ లక్ష్యం అని.. కార్యకర్తలు ఆ మేరకు పనిచేయాలని సూచించారు సీఎం చంద్రబాబు నాయుడు.


