Mobile Popup Ad
Mobile Popup Ad

చంద్రబాబు మార్క్ టీమ్.. TDPకి సరికొత్త లుక్

కలం, వెబ్‌ డెస్క్‌ : తెలుగుదేశం పార్టీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీలతో పాటు పొలిట్ బ్యూరో సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకలో నారా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. 44 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా పార్టీకి పూర్తి స్థాయి ఫ్రెష్ లుక్ ఇచ్చేలా హైకమాండ్ అడుగులు వేసింది.

సీనియర్ల అనుభవం, యువత ఉత్సాహం కలగలిసేలా ఈ కమిటీల (TDP New Committees) కూర్పు జరిగింది. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు (Chandrababu) హయాంలో కీలక పాత్రలు పోషించిన యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్లు లోకేష్ బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత కమిటీలోనూ కొనసాగుతుండటం విశేషం. కేవలం ఉన్నత స్థాయి నేతలకే పరిమితం కాకుండా మండల, క్లస్టర్ స్థాయి నాయకులకు పొలిట్ బ్యూరోలో చోటు కల్పించి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

క్షేత్ర స్థాయిలో కష్టపడి పనిచేసిన వారికి ఈ నియామకాల్లో పెద్దపీట వేశారు. ముఖ్యంగా మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికొండ ధనుంజయ్, గజపతినగరం మండల అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి వంటి వారికి లభించిన ప్రాధాన్యత కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పార్టీ గళాన్ని వినిపించిన వారికి సైతం ఈసారి కమిటీల్లో గుర్తింపు లభించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>