కలం, వెబ్‌డెస్క్: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి రథోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, కన్నులపండువగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలలో మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satya Kumar Yadav) ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్థానిక కళాకారులతో కలిసి డప్పు వాయిస్తూ ఉత్సవాల్లో సందడి చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. “గోవిందా గోవిందా” అంటూ భక్తుల నామస్మరణతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో మారుమ్రోగింది.

