కలం, వెబ్ డెస్క్ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై మంత్రులతో ప్రత్యేకంగా చర్చించారు. రాబోయే 3 నుంచి 4 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు (AP Municipal Elections) నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎన్నికలకు వెళ్లే అంశంపై ప్రభుత్వం (AP Govt) ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రులకు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. స్థానిక స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. పరిస్థితులను పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Read Also: సంచలనం.. ప్రధాని మోదీ హత్యకు కుట్ర?
Follow Us On: X(Twitter)

