ఉపఎన్నిక(Jubilee Hills Bypoll) నేపథ్యంలో బోరబండ(Borabanda)లో వాతావరణ వేడెక్కింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు.. తమ పార్టీ ఈవీఎం నెంబర్.2ను సూచించే టీషర్ట్‌లు వేసుకుని ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్(BRS) నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని తెలిపారు. ఈ క్రమంలోనే టీషర్ట్ అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే జోక్యం చేసుకున్న పోలీసులు.. సదరు కాంగ్రెస్(Congress) కార్యకర్తల చేత టీషర్ట్‌లు తీయించేశారు.
Jubilee Hills Bypoll | కానీ, ఈ అంశంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వాళ్ల టీషర్ట్‌లో ఎన్నికల అధికారులు, పోలీసులకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.
Read Also: బీహార్‌తో పాటు ఆరు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం..
Follow Us on: Instagram

