epaper
Tuesday, November 18, 2025
epaper

బీహార్‌తో పాటు ఆరు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం..

ఇండియాలో మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్(Polling) జరుగుతోంది. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభం కాగా.. మరో ఆరు రాష్ట్రాల్లో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం పోలింగ్ షురూ అయింది. వాటిలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా ఒకటి. కాగా బీహార్‌(Bihar)లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. చలి తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ ఓటర్లు పోలింగ్ బూత్‌ల దగ్గర ఉదయం 6:30 గంటల నుంచే బారులు తీరారు. ఈ రెండో విడత పోలింగ్ మొత్తం 20 జిల్లాల్లోని 122 సీట్లకు జరుగుతోంది. ఈ రెండో విడతలో సుమారు 3 కోట్ల 70 లక్షల 13 వేల 556 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండో విడత పోలింగ్ కోసం 45 వేలకుపైగా పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు.

ఉపఎన్నికలు ఇలా..

ఒమర్ అబ్దుల్లా రాజీనామాతో జమ్మూకశ్మీర్‌(Jammu Kashmir)లోని బుడ్‌గామ్ నియోజకవర్గంలో ఉపఎన్నిక జరుగుతోంది. 2024 ఎన్నికల్లో బుడ్‌గామ్, గందేర్‌బల్ నియోజకవర్గాల్లో అబ్దుల్లా విజయం సాధించారు. కాగా, బుడ్‌గాప్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి.. గందేర్‌బల్ నియోజకవర్గాన్ని స్వీకరించారు. దీంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఉపఎన్నికలో నేషనల్ కాన్ఫరెన్స్ తరుపున అగా మెహ్మూద్, పీడీపీ తరుపున అగ సయ్యద్ ముంతాజిర్, బీజేపీ తరుపున సయ్యద్ మోహ్‌సిన్ పోటీలో ఉన్నారు.

వీటితో పాటు రాజస్థాన్‌(Rajasthan)లో అంటా అసెంబ్లీ నియోజకవర్గం, ఝార్ఖండ్‌లో ఘట్‌షిలా నియెజకవర్గం, తెలంగాణ జూబ్లీహిల్స్ నియోజకవర్గం, పంజాబ్‌లో తర్న్ తారణ్ నియోజకవర్గం, మిజోరంలో డంపా నియోజకవర్గం, ఒడిశాలో నౌపాడా నియోజకవర్గాల్లో ఉపఎన్నిక(Polling) జరుగుతోంది.

Read Also: హైదరాబాద్-విజయవాడ హైవేపై బస్సు దగ్దం..

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>