కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు ఇసుమంతయినా గౌరవం లేదని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి(Sunitha Lakshma Reddy) వ్యాఖ్యానించారు. ఇందుకు ఐఅండ్పీఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ హర్ష భార్గవికి ఎదురైన చేదు అనుభవం నిలువెత్తు నిదర్శనమని అన్నారు. ‘‘ఢిల్లీలో CPROగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన హర్ష భార్గవి(Harsha Bhargavi).. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్లారు. అయితే ఆమెను పోలీసులు గేటు బయటే అడ్డుకున్నారు. ఆమె ఎవరో తమకు తెలియదని చెప్పి ఆమెను లోపలికి అనుమతించలేదు. పైగా గేటు దగ్గర నిలబడితే అరెస్ట్ చేస్తామని అధికారులు బెదిరించారు. దీంతో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఒక మహిళను ఎంత దారుణంగా ఏ ముఖ్యమంత్రి అవమానించింది లేదు. మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పే ఈ ప్రభుత్వం.. వారికి కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు’’ అని సునీత లక్ష్మారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also: అవినీతి విషయంలో రాజీ లేదు: సీఎం

