ఏఆర్ రెహ్మాన్(AR Rahman).. తన సంగీతంలో ప్రపంచాన్నే ముగ్ధుడిని చేసిన మ్యూజీషియన్. రెహ్మాన్ సంగీతం అంటేనే ఆ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతాయి. ఎప్పుడో దశాబ్దాల క్రితం రెహ్మాన్ కంపోజ్ చేసిన పాటలు, ఆర్ఆర్‌లు ఇప్పటికీ బంపర్ హిట్‌గా నిలుస్తున్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా..? ఆ సంగీత మాంత్రికుడిని లైవ్‌లో చూడాలని అని మీకుంటే ఇదే మంచి అవకాశం. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీ(Ramoji Film City) వేదికగా రెహ్మాన్ ఓ లైవ్ కాన్సర్ట్ చేయనున్నాడు. అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ ప్రేక్షకులను అలరించిన రెహ్మాన్ ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించనున్నాడు. నవంబర్ 8న రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ లైవ్ కాన్సర్ట్ జరగుంది. దీనిని హైదరాబాద్ టాకీస్ నిర్వహిస్తోంది. ఇందులో రెహ్మాన్ తన సూపర్ హిట్ పాటలను పాడతాడు. ఈ కాన్సర్ట్‌పై రెహ్మాన్(AR Rahman) కూడా రెస్పాండ్ అయ్యాడు.
‘‘హైదరాబాద్.. ఓ డైనమిక్ సిటీగా అభివృద్ధి చెందుతుంది. లైవ్ కాన్సర్ట్‌లకు ఇక్కడ ప్రజలు ఎంతో ఆదరణ చూపుతున్నారు. ఏఐ ప్రభావం పెరుగుతున్న సమయంలో ప్రేక్షకులు ఇంకా సంగీత అనుభూతి కోసం లైవ్ కాన్సర్ట్‌లకు రావడం కళాకారులకు పోత్సాహాన్ని ఇస్తుంది. ఇది మన సంగీత పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం’’ అని అన్నాడు.
Read Also: పిల్లల కోసం రెడీ అవుతున్నా: రష్మిక

