కలం, వెబ్ డెస్క్: చిత్తూరు (Chittoor) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ఓ కంటైనర్ వాహనం కారును ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని ఇరువారం దగ్గర శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. కంటైనర్ వాహనం వేగంగా వచ్చిన కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనతో రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: తిరుపతిలో జాతీయ ఆయుర్వేద వైద్య సంస్థ
Follow Us On: Pinterest


