epaper
Wednesday, February 18, 2026
epaper

ఉత్తర కొరియా.. కిమ్ వారసురాలికి పగ్గాలు..!

కలం, డెస్క్ : ఉత్తర కొరియాలో (North Korea) పెను మార్పులు జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తన కుమార్తెకు పగ్గాలు అప్పగించబోతున్నట్టు సౌత్ కొరియా నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ తెలిపింది. ఈ నెలాఖరులోగా పెద్ద రాజకీయ సభ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడంట కిమ్. కిమ్ తన కుమార్తె కిమ్ జు యేను 2022లో మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేశాడు. 2023లో మిలిటరీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్యోంగ్యాంగ్ లో మరోసారి కిమ్ జుయే కనిపించారు.

అప్పటి నుంచే ఉత్తరకొరియాలో (Kim Jong Un) జరుగుతున్న అధికారిక కార్యక్రమాలకు కిమ్ జు యే హాజరవుతూ వస్తున్నారు. ఆ దేశ రాజకీయాలపై కిమ్ జుయేకు అన్ని రకాల శిక్షణలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే కిమ్ ఇంత అర్జెంటుగా ఎందుకు అధికార మార్పిడి చేయాలనుకుంటున్నాడో తెలియరాలేదు.

Read Also: వాట్సాప్​ను బ్లాక్​ చేసిన రష్యా​​

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>