epaper
Wednesday, February 18, 2026
epaper

తిరుపతిలో జాతీయ ఆయుర్వేద వైద్య సంస్థ

కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ఆయుర్వేద వైద్య విద్యను బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో తిరుపతిలో (Tirupati) జాతీయ ఆయుర్వేద వైద్య సంస్థ (National Institute of Ayurveda) స్థాపనకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అదేవిధంగా, అమరావతి పరిధిలో రెండు జాతీయ సంస్థల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను గుర్తించి కేటాయించింది.

రాష్ట్రంలో ఆయుర్వేద, యునానీ వైద్య విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు ఆయుర్వేద, ఒక యునానీ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంస్థల స్థాపనతో రాష్ట్రంలో వైద్య విద్యా అవకాశాలు విస్తరించడంతో పాటు, సంప్రదాయ వైద్య విధానాలకు మరింత ప్రోత్సాహం లభించనుంది.

 Read Also: ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన బండ్ల గణేష్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>