కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ మొత్తం 360 డిగ్రీలు కవర్ చేసేలా మెట్రో ప్రాజెక్టును విస్తరిస్తామని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) ప్రకటించారు. అసెంబ్లీలో పురపాలక, జీహెచ్ ఎంసీ చట్ట సవరణ బిల్లుపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. జీహెచ్ఎంసీలో పరిపాలనను మరింత విస్తరించేందుకు ఈ చట్ట సవరణ చేస్తున్నామని తెలిపారు.’ ప్రస్తుతం మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్ ను ప్రస్తుతం మూడు కార్పొరేషన్లుగా విభజించాలని ప్రాథమికంగా అనుకుంటున్నాం. భవిష్యత్ లో ఇంకా ఎన్ని చేస్తామో ఇప్పుడే తెలియదు. మెట్రో ప్రాజెక్టు (Metro Project) విస్తరణకు పర్మిషన్ అవాంతరాలు, ప్రయాణికులకు రవాణా ఇబ్బందులు రావొద్దనే ఉద్దొశంతోనే ప్రభుత్వం మెట్రో రైలును తీసుకుంటుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.
హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా మెట్రో ప్రాజెక్టును విస్తరిస్తాం అని చెప్పుకొచ్చారు మంత్రి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఎయిర్ క్వాలిటీ 174 ఇండెక్స్ పాయింట్లు ఉందని.. ఇంతకంటే గాలి క్వాలిటీ పడిపోవద్దనే ఉద్దేశంతోనే పరిశ్రమలను ఓఆర్ ఆర్ బయటకు పంపిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ లో కేవలం ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే తిరిగేలా ప్లాన్ చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) వివరించారు.
Read Also: ఎనిమిదేళ్లుగా నెం1 క్లీనెస్ట్ సిటీ.. తాగునీటి కలుషితంతో 10 మంది మృతి!
Follow Us On : WhatsApp


