కలం, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న మూవీ మన శంకర వర ప్రసాద్ గారు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్లు వేగంగా చేస్తున్నారు. నేడు మూడో సాంగ్ ను రిలీజ్ చేశారు. అనిల్ రావిపూడి తాను చదువుకున్న గుంటూరులోని విజ్ఞాన్ కాలేజీలో ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. ‘చిరంజీవితో సినిమా చేయాలనే కల ఈ విధంగా తీరిపోయిందని తెలిపాడు. పైగా చిరంజీవి, వెంకటేశ్ ఒకే సినిమాలో చూడాలనేది చాలా మంది కోరిక అని.. అది తన సినిమాలో కుదరడం చాలా సంతోషంగా ఉందని వివరించాడు అనిల్ రావిపూడి.
తాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి కేవలం హార్డ్ వర్క్ ను మాత్రమే నమ్ముకున్నానని.. నెగెటివ్ కామెంట్స్ ను అస్సలు పట్టించుకోలేదని తెలిపాడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). ‘మొదటి సినిమా అవకాశం వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యానో.. ప్రతి సినిమాకు అలాగే ఫీల్ అవుతాను. వెంకటేశ్ తో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ నా కెరీర్ ను మలుపుతిప్పింది. ఆ సినిమా కథను నమ్మి వెంకటేశ్ నాకు అవకాశం ఇచ్చారు. ఆయన వల్లే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది. ఆయన నా కెరీర్ కు ఓ టర్నింగ్ పాయింట్ ఇచ్చారు’ అంటూ తెలిపాడు అనిల్ రావిపూడి. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


