epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

తైవాన్​ చుట్టూ చైనా వార్​ డ్రిల్స్​

కలం, వెబ్​డెస్క్​: తూర్పు చైనా సముద్రంలో మళ్ళీ టెన్షన్​ నెలకొంది. ‘జస్టిస్​ మిషన్​ 2025’ పేరుతో తైవాన్​ చుట్టూ​ చైనా వార్​ డ్రిల్స్ (China Vs Taiwan)​ మొదలుపెట్టింది. సోమవారం తైవాన్ జలసంధిలో భారీ స్థాయిలో యుద్ధ విన్యాసాలు మొదలుపెట్టింది. చైనా ఎయిర్​ఫోర్స్​, నేవీ, రాకెట్​ ఫోర్స్​ దళాలు తైవాన్​ సమీపంలో డ్రిల్స్​ ప్రారంభించాయి. శత్రువు నుంచి సముద్రం, ఆకాశం ద్వారా వచ్చే ముప్పులు ఎదుర్కోవడానికి ఈ యుద్ధ విన్యాసాలు చేస్తున్నట్లు చైనా చెబుతోంది. మరోవైపు చైనా దుందుడుకు చర్య తమకు ముప్పుగా పరిణమించిందని తైవాన్ ఆందోళన చెందుతోంది. చైనా ఇలా దూకుడుగా వ్యవహరించడానికి కారణం అమెరికా, జపాన్​ చేసిన ప్రకటనలు కారణం కావడం గమనార్హం.

తనను తాను కాపాడుకునేందుకు తైవాన్​కు 11బిలియన్​ డాలర్ల ఆయుధాలు విక్రయిస్తామని ఇటీవల అమెరికా ప్రకటించింది. దీనికితోడు ఆదివారం జపాన్​ ప్రధాని తకాయిచి సనాయె చేసిన వ్యాఖ్యలు చైనా కోపానికి మరింత ఆజ్యం పోశాయి. తైవాన్​ను రక్షించేందుకు అవసరమైతే తాము రంగంలోకి దిగుతామని జపాన్​ ప్రధాని అనడం చైనాకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. అందుకే ఉన్నట్టుండి ఇలా తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాలకు దిగినట్లు తెలుస్తోంది. కాగా, తైవాన్​ తాము స్వతంత్ర దేశమని చెబుతుండగా, లేదు మా దేశంలో భాగమని చైనా అంటోంది. తైవాన్​ను అమెరికా సహా వివిధ దేశాలు అండగా ఉండడం బీజింగ్​ సహించలేకపోతోంది. అందుకే, తైవాన్​ను భయపెట్టేలా డ్రిల్స్ (China Vs Taiwan)​ చేపట్టినట్లు తెలుస్తోంది.

Read Also: గాలిలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>