కలం వెబ్ డెస్క్ : అమెరికాలోని న్యూజర్సీ(New Jersey)లో ఆదివారం రెండు హెలికాప్టర్లు(Two Helicopters) గాలిలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఘటనలో ఒక పైలట్(Pilot) ప్రాణాలు కోల్పోగా మరొక పైలట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హమ్మొంటన్ నగరంలో ఈ ప్రమాదం జరిగింది. రెండు హెలికాప్టర్లలో కేవలం పైలట్లు మాత్రమే ఉన్నారు. ఒక హెలికాప్టర్ నేలపై కూలిన తర్వాత పూర్తిగా దగ్ధమైంది.
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఢీకొన్న ఎన్‌స్ట్రోమ్ 280C, ఎన్‌స్ట్రోమ్ F-28A మోడళ్లు చిన్న హెలికాప్టర్లు. వీటిలో సాధారణంగా ముగ్గురు మాత్రమే ప్రయాణించగలరు. అమెరికా జాతీయ రవాణా భద్రతా మండలి (NTSB), ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read Also: మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం.. 13 మంది మృతి, 98కి గాయాలు
Follow Us On: Instagram


