కలం, వెబ్ డెస్క్: ప్రపంచ దేశాల్లో నూతన ఆవిష్కరణలు చేయడంలో చైనా (China) ముందుంటుంది. ఇప్పటికే ఎన్నో భారీ నిర్మాణాలు, కట్టడాల్లో ప్రత్యేకత చాటుకున్న చైనా మరో అద్భుతాన్ని కళ్లముందు నిలిపింది. అదే.. చైనాలోని జియాంగ్‌షీ ప్రావిన్స్‌లో లింగ్షాన్ పర్వత ఎస్కలేటర్. 1,236 మీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన అవుట్డోర్ ఎస్కలేటర్‌గా (Longest Escalator) పేరొందింది. పర్యాటకులు నడిచే పని లేకుండానే మంచు కొండల అందాలను ఈ ఎస్కలేటర్ ద్వారా సులభంగా చూడొచ్చు.
లింగ్షాన్ పర్వతం.. చైనాలో జియాంగ్‌షీ ప్రావిన్స్‌లోని శాంగ్రావో (Shangrao) నగర సమీపపు గ్వాంగ్సిన్లో ఉంది. ఇది గొప్ప పర్యాటక ప్రాంతం. దాదాపు 72 పర్వతాలు, అందమైన రాక్ ఆకృతులతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే సుమారు రెండు గంటలపాటు శ్రమించి మెట్లు ఎక్కాల్సి వచ్చేది. ఈ సమస్యకు చైనా చెక్ పెడుతూ అతిపెద్ద ఎస్కలేటర్ (Longest Escalator)ను నిర్మించింది. దీని ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే పర్యాటక అందాలను చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వారెవ్వా చైనా.. ప్రపంచంలోనే అతిపెద్ద అవుట్డోర్ ఎస్కలేటర్ ఇదిగో
The 1236 meter world’s longest outdoor sightseeing escalator reaches the snowy mountains in China.#China #longestEscalator #mountainEscalator #kalam #kalamdaily #kalamtelugu pic.twitter.com/gtKJve3Fyz— Kalam Daily (@kalamtelugu) January 22, 2026
Read Also: పీక్స్‌కి ట్రంప్ పీస్ డ్రామా.. 8 యుద్ధాల వాస్తవాలు ఇవే!
Follow Us On: Instagram


