సబలెంకాకు షాకిచ్చిన 20 ఏళ్ల భామ!

కలం, స్పోర్ట్స్ : చైనా ఓపెన్‌ (China Open) లో వరన్డ్ నెంబర్-2 సబలెంకా (Aryna Sabalenka) కు భారీ షాక్ తగిలింది. 20ఏళ్ల చెక్ రిపబ్లిక్ ప్లేయర్ నికోలా బార్టంకోవా (Nikola Bartunkova) చేతిలో చిత్తయింది. దీంతో మూడో రౌండ్‌లోనే సబలెంకా ఇంటి బాట పట్టింది. నికోలా మ్యాచ్ ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం కనబరించింది. 6-4, 6-3తో సబలెంకాను వరుస సెట్లలో ఓడించింది. మ్యాచ్‌ గంటా 35 నిమిషాల్లో ముగిసింది. బార్టుంకోవా తొలి సెట్‌లోనే సబలెంకా సర్వ్‌ను బ్రేక్‌ చేసింది. ఆరో గేమ్‌లో ఐదు బ్రేక్‌ పాయింట్లను కాపాడుకుని 4-2 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సర్వీస్‌ను నిలబెట్టుకుని 6-4తో సెట్‌ను సొంతం చేసుకుంది.

రెండో సెట్‌లోనూ అదే దూకుడు కొనసాగించింది. సబలెంకా సర్వ్‌ను మరోసారి బ్రేక్‌ చేసి 3-1 ఆధిక్యం సాధించింది. తన సర్వీస్‌ను కాపాడుకుంటూ ముందుకు సాగింది. తొమ్మిదో గేమ్‌లో మరో బ్రేక్‌తో మ్యాచ్‌ను 6-3తో ముగించింది. ముఖ్యంగా తన సర్వీస్‌లో ఒక్క బ్రేక్‌ పాయింట్‌ కూడా ఎదుర్కోకపోవడం బార్టుంకోవా ఆధిపత్యాన్ని చూపించింది. 20 ఏళ్ల బార్టుంకోవాకు ఇది టాప్‌-10 ఆటగాళ్లపై రెండో విజయం. అంతకుముందు 2026 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అప్పటి ప్రపంచ నంబర్‌-10 బెలిండా బెన్సిచ్‌ను ఓడించింది.

సబలెంకా ఓటమితో చైనా ఓపెన్‌లో మహిళల విభాగం నుంచి టాప్‌-2 సీడ్లు రెండూ నిష్క్రమించాయి. ఒక రోజు ముందే వరల్డ్ నంబర్‌-1 ఎలెనా రిబాకినా కూడా టోర్నీ నుంచి బయటపడింది. దీంతో రౌండ్‌-16లో టాప్‌-2 సీడ్లు లేకపోవడం 2015 తర్వాత ఇదే తొలిసారి. బీజింగ్‌ టోర్నీలో సబలెంకాకు ఇది మరో నిరాశాజనక ఫలితం. ఇక్కడ ఆమె ఇప్పటివరకు ఐదుసార్లు మెయిన్‌ డ్రాలో ఆడినా ఒక్కసారి కూడా క్వార్టర్‌ఫైనల్స్‌ దాటలేకపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>