అశ్వాపురంలో దారుణం.. బాలికపై అత్యాచారయత్నం

కలం, ఖమ్మం బ్యూరో: సభ్య సమాజం తలదించుకునేలా 60 ఏళ్ల వృద్ధుడు మనవరాలి వయసున్న మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. అశ్వాపురం (Aswapuram) మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాయల కోటయ్య (60) అదే వీధిలో ఉండే 16 ఏళ్ల బాలికపై కన్నేశాడు. ఇంటర్ చదువుతున్న ఆ బాలిక.. కాలేజీ నుంచి తిరిగి ఇంటికి వెళ్లడానికి రామచంద్రాపురం బస్ స్టాప్ వద్ద వేచి ఉంది. అదే సమయంలో అటుగా ద్విచక్రవాహనంపై వస్తున్న కోటయ్యను చూసింది. ఇంటి ముందు ఉండే తాతయ్యనే కదా.. అని నమ్మి బాలిక బైక్‌ ఎక్కింది.

చంపేస్తానని బెదిరింపులు..

కొంతదూరం వెళ్లాక కోటయ్య బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన బాలిక అతడి నుంచి తప్పించుకుంది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని కోటయ్య తీవ్రంగా బెదిరించాడు. భయపడకుండా ఇంటికి చేరిన బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. తీవ్ర ఆగ్రహానికి గురైన బాలిక బంధువులు, కోటయ్యపై దాడి చేసి అతడిని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కోటయ్యను అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా రాయల కోటయ్యపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అదే సమయంలో చట్టవిరుద్ధంగా కోటయ్యపై దాడికి పాల్పడినందుకు బాలిక బంధువులైన 14 మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ​

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>