విద్యార్థులను చితకబాదిన ప్రధానోపాధ్యాయురాలు

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామానుజవరం (Ramanujavaram) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు దారుణానికి ఒడిగట్టారు. అల్లరి చేశారన్న నెపంతో 12 మంది విద్యార్థులను మిషన్ భగీరథ నీటి పైపుతో విచక్షణా రహితంగా చితకబాదారు. రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి జిల్లాలో కలకలం రేపుతోంది.​అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పాఠశాలకు సెలవు ఉండటంతో కొంతమంది విద్యార్థులు స్కూల్ ప్రాంగణంలో వాలీబాల్ ఆడుకున్నారు. అదే సమయంలో విద్యార్థులు అల్లరి చేస్తున్నారంటూ పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రం టీచర్ ప్రధానోపాధ్యాయురాలికి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.

మిషన్ భగీరథ పైపుతో దాడి..

అంగన్వాడీ టీచర్ ఫిర్యాదుతో తీవ్ర ఆగ్రహానికి గురైన హెచ్‌ఎం యశోద, మరుసటి రోజు పాఠశాలకు వచ్చిన తరువాత మైదానంలో ఆడుకున్న 12 మంది విద్యార్థులను నిలదీశారు. ఆవేశంతో ఊగిపోయిన యశోద.. విద్యార్థులను మిషన్ భగీరథ వాటర్ పైపుతో విచక్షణా రహితంగా కొట్టారు. ​ఈ దాడిలో విద్యార్థుల వీపు, చేతులు, కాళ్లపై తీవ్రంగా వాతలు తేలి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులు అవస్థలు పడుతుండటాన్ని గమనించిన తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ప్రధానోపాధ్యాయురాలి అమానుష ప్రవర్తనపై మండిపడ్డారు. బాధితుల తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి హెచ్‌ఎం యశోదను వెంటనే సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>