చైనా ఓపెన్‌లో జకోవిచ్ జైత్రయాత్ర

కలం, స్పోర్ట్స్​ : చైనా ఓపెన్ (China Open) టెన్నిస్ టోర్నమెంట్‌లో సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ (Novak Djokovic) మరోసారి తన ఆధిపత్యాన్ని కనబరిచాడు. ఆరు సార్లు చైనా ఛాంపియన్‌గా ఉన్న జకోవిచ్ దాదాపు 11 ఏళ్ల తర్వాత బీజింగ్ ఫైట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అతడి రీ ఎంట్రీ కూడా ఇప్పుడు అదరగొడుతున్నారు. వరుస విజయాలతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్లో జకోవిచ్ 4-6, 6-4, 6-4 తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్, జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను చిత్తు చేశాడు. తొలి సెట్ కోల్పోయినప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నాడు. ఈ విజయంతో బీజింగ్ టోర్నీలో జకోవిచ్ తన అజేయ రికార్డును 32-0కు పెంచుకున్నారు.

తొలి సెట్‌లో జ్వెరెవ్ ఆరంభంలోనే జకోవిచ్ (Novak Djokovic) సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆధిక్యం సాధించారు. అయితే, తదుపరి రెండు సెట్లలో జకోవిచ్ తన అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించి కీలక సమయాల్లో బ్రేక్ పాయింట్లు సాధించి జ్వెరెవ్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. 2 గంటల 35 నిమిషాల పాటు ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. జకోవిచ్ చేతిలో ఓటమితో జ్వెరెవ్‌ వరల్డ్ నంబర్ 1 స్థానాన్ని అందుకునే అవకాశాన్ని కోల్పోయారు. ఈ టోర్నీలో ఏడోసారి సెమీస్‌కు చేరిన జకోవిచ్, తదుపరి మ్యాచ్‌లో డానిల్ మెద్వెదెవ్‌తో తలపడనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>