డీలిమిటేషన్ బిల్లుపై MIM రియాక్షన్ ఇదే!

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ (Delimitation) బిల్లును ఎంఐఎం (MIM)  తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్ వేదికగా మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన చేపడితే, జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలుచేసిన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

కుటుంబ నియంత్రణ పాటించి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న రాష్ట్రాలకు ఈ బిల్లు శిక్షగా మారుతుందన్నారు. తద్వారా లోకసభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గి, రాజకీయంగా ప్రాముఖ్యత దెబ్బతింటుందని విమర్శించారు. ఈ నిర్ణయం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే బిల్లులు ప్రవేశపెడుతున్నట్లు ఒవైసీ మండిపడ్డారు.

Read Also: లోక్ సభలో మహిళలకు 272 సీట్లు : కేంద్రమంత్రి అర్జున్ మేఘ్వాల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>