epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

పిల్లల జీవితాలతో ఆడుకున్నారు.. వైసీపీపై చంద్రబాబు ఫైర్

కలం, వెబ్‌డెస్క్ : ఇంగ్లీష్ మీడియం పేరుతో పిల్లల జీవితాలతో ఆడుకున్నారని వైసీపీ (YCP) ని ఉద్దేశిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థను కూడా పటిష్టం చేసి భవిష్యత్ తరాలకు బలమైన పునాది వేస్తామని తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. వ్యవస్థలన్నింటినీ సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం కేంద్ర పథకాల్లో అవకతవకలు పాల్పడి.. కేంద్ర నిధులను ఇతర పథకాలకు మళ్లించిందని సీఎం చంద్రబాబు (Chandrababu) ఆరోపించారు. వైసీపీ (YCP) దెబ్బకు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతిన్నదన్నారు. ఆ పార్టీ చేసిన దారుణాల వల్ల గతంలో పారిశ్రామికవేత్తలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ పెట్టుబడులు వస్తున్నాయని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వంలో రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టులపై పెట్టుబడులను భారీగా పెంచామన్నారు. ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

Read Also: గోదావరి పుష్కరాల నిధులకు రిక్వెస్టు రాలేదు.. తెలంగాణ వైఖరిపై కేంద్రం క్లారిటీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>