కలం, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా సోషల్ మీడియాలో ఫొటో, పేరు వాడుకోకుండా చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ వేశారు. విచారించిన కోర్టు ఎన్టీఆర్ పేరును వాడుతున్న ఈకామర్స్, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. తదుపరి విచారణ డిసెంబర్ 22కు వాయిదా వేసింది. గతంలో నాగార్జున, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, చిరంజీవి లాంటి వారు కూడా ఇలాగే పిటిషన్లు వేసి ఆర్డర్లు తెచ్చుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మీద సోషల్ మీడియాలో ఈ మధ్య ట్రోలింగ్ ఎక్కువగా వస్తోంది.
దీన్ని కంట్రోల్ చేసేందుకు ఎన్టీఆర్(Jr NTR) ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో తన పర్మిషన్ లేకుండానే తనను చాలా వివాదాల్లోకి లాగుతున్నారని, అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారంటూ ఎన్టీఆర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై కోర్టు కూడా సీరియస్ గానే స్పందిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మూడు వెబ్ సైట్లకు కూడా ఆదేశాలిచ్చింది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో చేస్తున్న మూవీలో నటిస్తున్నాడు. దానిపై భారీ అంచనాలున్నాయి. ఆ మూవీ కోసం లుక్ కంప్లీట్ గా మార్చేసుకుంటే దాని మీద ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే.
Read Also: ఫ్యూచర్ సిటీకి అన్నపూర్ణ స్టూడియో
Follow Us On: Pinterest


