కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ (MRPS) ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను (Chakali Ilamma Jayanti) శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట గల ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ ధైర్యంగా పోరాడారని, ఆమె పోరాట స్ఫూర్తి నేటి యువత, విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు శనిగారపు రవి, రాష్ట్ర నాయకులు రాజేశ్వర్, నామత్కర్ లక్ష్మణ్, రాజు, బాబు, శివ, 57 ఉపకులాల రాష్ట్ర ఉపాధ్యక్షులు గంధం గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

