Mobile Popup Ad
Mobile Popup Ad

హనుమకొండలో పట్టపగలే చైన్ స్నాచింగ్ కలకలం

కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ (Hanumakonda) నగరంలోని బొక్కలగడ్డలో మంగళవారం ఉదయం చైన్ స్నాచింగ్ (Chain Snatching) కలకలం సృష్టించింది. సిటిజన్ ఫంక్షన్ హాల్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తి, ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో హనుమకొండ, సీసీఎస్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

నిందితుడిని గుర్తిస్తే సమాచారం ఇవ్వండి

సీసీ కెమెరాల ఆధారంగా చైన్ స్నాచింగ్‌కు పాల్పడిని నిందితుడిని హనుమకొండ పోలీసులు గుర్తించారు. నిందితుడి చిత్రాన్ని విడుదల చేశారు. గ్రీన్ కలర్ టీ షర్ట్, నల్ల ప్యాంట్, క్యాప్ ధరించిన నిందితుడిని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని హనుమకొండ ఇన్స్‌స్పెక్టర్ శివకుమార్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>