కలం, వరంగల్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ (Hanumakonda) జిల్లాలో రాష్ట్రస్థాయి రైతు మేళా (Rythu Mela) ప్రారంభమైంది. హనుమకొండ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల వేదికగా ఏర్పాటు చేసిన ఈ మేళాను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) ప్రారంభించారు. రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థక శాఖల ఆధ్వర్యంలో నేటి (మంగళవారం) నుంచి మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది.
అయితే ఈ మేళాలో ఆధునిక సాగు పద్ధతులు, డ్రోన్ల వినియోగం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు. అంతే కాకుండా రైతులు నేరుగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులతో మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు.

