పార్టీలకు అతీతంగా కరీంనగర్ అభివృద్ధి : బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: పార్టీలకు అతీతంగా కలిసి పనిచేస్తే కరీంనగర్ అభివృద్ధిని అడ్డుకునే వారే  ఉండరని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ (Karimnagar Corporation) పరిధిలో ఇప్పటికే మెయిన్ రోడ్ల నిర్మాణం పూర్తయిందని, ఇకపై గల్లీ రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. సోమవారం కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి, కొత్తపల్లి చెరువుల పునరుద్ధరణ పనులకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చెరువుల చుట్టూ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలన జరిపిన కేంద్ర మంత్రి, అమృత్ 2 పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. రూ.5.82 కోట్ల నిధులతో తీగలగుట్టపల్లి, కొత్తపల్లి, రేకుర్తి చెరువులను పునరుజ్జీవింపజేస్తున్నట్లు తెలిపారు. చెరువుల చుట్టూ బండ్ నిర్మాణం చేసి, అందంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. వినాయక నిమజ్జనం, బతుకమ్మ నిమజ్జనం సమయంలో భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులు ఇకపై ఉండవని ఆయన (Bandi Sanjay) పేర్కొన్నారు. ఈ చెరువులను మినీ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అభివృద్ధిలో కరీంనగర్ వేగంగా ముందుకు సాగుతోందని, కేంద్ర రాష్ట్ర నిధులతో మరిన్ని ప్రాజెక్టులు చేపడతామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేస్తే కరీంనగర్‌ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దవచ్చని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Read Also: బీఆర్ఎస్‌లో ముసలం మొదలైంది: మంత్రి లక్ష్మణ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>