కలం, స్పోర్ట్స్ : ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) తన అద్భుతమైన ఫామ్‌తో 1000 గోల్స్ చారిత్రక మైలురాయికి మరింత చేరువయ్యారు. ఏఎఫ్సీ ఛాంపియన్స్ లీగ్ టూ క్వార్టర్ ఫైనల్స్‌లో అల్-వాసల్ జట్టుపై అల్-నసర్ 4-0తో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో రొనాల్డో సేన అధికారికంగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. మ్యాచ్ ప్రారంభమైన 11వ నిమిషంలోనే రొనాల్డో (Cristiano Ronaldo) తన కెరీర్‌లో 969వ గోల్ సాధించి జట్టుకు శుభారంభం ఇచ్చారు. బాక్స్ లోపల వచ్చిన అవకాశాన్ని ఆయన గోల్‌గా మలిచి మైదానంలో జోరు పెంచారు. ఫస్ట్ హాఫ్ ముగిసేలోపే అల్-నసర్ మరో రెండు గోల్స్ చేసి మ్యాచ్‌ను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. జోయావో ఫెలిక్స్ అందించిన అద్భుతమైన కార్నర్ షాట్‌ను ఇనిగో మార్టినెజ్ హెడర్ ద్వారా గోల్ పోస్ట్‌లోకి పంపారు. ఆ వెంటనే అబ్దుల్లా అల్-అమ్రి మరో గోల్ చేయడంతో అల్-నసర్ 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
ప్రత్యర్థి జట్టు అల్-వాసల్ ఎంత ప్రయత్నించినా అల్-నసర్ రక్షణ శ్రేణిని దాటి ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. గోల్ కీపర్ బెంటో సమర్థవంతంగా అడ్డుకోవడంతో వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. సెకండ్ హాఫ్‌లో కూడా అల్-నసర్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మిడ్‌ఫీల్డర్ మార్సెలో బ్రోజోవిచ్ ఆటను సమన్వయం చేస్తూ బంతిపై పట్టు సాధించారు. రొనాల్డో (Cristiano Ronaldo) 60 నిమిషాల తర్వాత మైదానం వీడినప్పటికీ అల్-నసర్ దూకుడు తగ్గలేదు. ఆట 80వ నిమిషంలో సాడియో మానే నాలుగో గోల్ చేసి విజయాన్ని ఖాయం చేశారు. ఈ గెలుపుతో అల్-నసర్ ఈ టోర్నీలో అత్యంత బలమైన జట్టుగా తన ముద్ర వేసింది.
Read Also: కేసీఆర్ పర్యటనలో కలకలం.. గాలిలోనే హెలికాప్టర్ చక్కర్లు!
Follow Us On : WhatsApp

