Mobile Popup Ad
Mobile Popup Ad

ఐఐఎం ఇవ్వలేం.. సీఎంకు కేంద్రం క్లారిటీ

కలం, తెలంగాణ బ్యూరో : తెలంగాణకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వాల్సిందిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రధాని మోడీని కలిసినప్పుడు రాతపూర్వకంగా రిక్వెస్టు చేశారు. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు సైతం గతేడాది డిసెంబరు 16న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. కానీ ఈ రిక్వెస్టులన్నింటినీ కేంద్రం బుట్టదాఖలా చేసింది. తెలంగాణకు (Telangana) ఎందుకు ఐఐఎం ఇవ్వడం సాధ్యం కాదో నిర్దిష్టమైన కారణాలు చెప్పకపోయినా పలు అంశాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాసిన రిప్లై లెటర్‌లో ధర్మేంద్ర ప్రదాన్ వివరించారు.

ఇప్పటికే చాలా ఉన్నత విద్యాసంస్థలున్నాయి :

తెలంగాణలో, హైదరాబాద్ నగరంలో ఇప్పటికే చాలా ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయని, ఇప్పుడు అదనంగా ఐఐఎం (IIM Telangana) ఇవ్వలేమని వివరించారు. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ, ఐఐటీ, ఎన్ఐటీ (వరంగల్), ఇఫ్లూ (EFLU), మౌలానా ఆజాద్ ఉర్దూ వర్శిటీ పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి ఆ లేఖలో గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సవరించిన యూనివర్శిటీల చట్టం ప్రకారం తెలంగాణలో ములుగు దగ్గర సమ్మక్క-సారక్క గిరిజన కేంద్ర విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి అనుమతి ఇచ్చిందని, కేంద్ర నుంచి రూ. 890 కోట్ల సాయం కూడా అందనున్నదని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐఐఎంను ఇచ్చే ప్రతిపాదనేదీ కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదని ధర్మేంద్ర ప్రదాన్ స్పష్టం చేశారు.

Read Also: మ‌హిళ‌కు వేధింపులు.. రోబో అరెస్ట్‌..!

Follow Us On: Youtube

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>