Mobile Popup Ad
Mobile Popup Ad

దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత పుకార్లు.. కేంద్రం కీలక నిర్ణయం

కలం, వెబ్ డెస్క్: దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత ఉందంటూ వస్తున్న పుకార్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో వంట గ్యాస్ సమస్య తగ్గించేందుకు కేంద్రం ప్రత్యామ్నాయ చర్యలను ప్రారంభించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సుపీరియర్ కిరోసిన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. సర్వీస్ స్టేషన్లలో 2500 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వ ఉంచేందుకు వెసులుబాటు చేసింది. ఈ మేరకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సుమారు 60 రోజులపాటు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు కేంద్ర ఆదేశాలు కొనసాగనున్నాయి.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>