హైద‌రాబాద్‌కు డ్ర‌గ్స్‌.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో టాస్క్ ఫోర్స్ త‌నిఖీలు!

క‌లం, వెబ్ డెస్క్‌: డ్ర‌గ్స్ అక్ర‌మ ర‌వాణాపై హైద‌రాబాద్ (Hyderabad) టాస్క్‌ఫోర్స్ పోలీసులు క‌ఠిన‌ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా మాద‌క ద్ర‌వ్యాలు ర‌వాణా చేస్తున్నార‌న్న ముంద‌స్తు స‌మాచారంతో బ‌స్సుల్లో ముమ్మ‌రంగా త‌నిఖీలు చేప‌ట్టారు. మొత్తం 20 ప్రైవేట్ ట్రావెల్స్ బ‌స్సుల్లో సోదాలు నిర్వ‌హించారు. ఇతర రాష్ట్రాల నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చే బ‌స్సుల‌పై ఫోక‌స్ పెట్టారు. ముఖ్యంగా రాజ‌స్థాన్, నాగ్‌పూర్ నుంచి వ‌చ్చే బ‌స్సుల‌ను టార్గెట్ చేసుకున్నారు. ఎక్కువ‌గా ఇత‌ర రాష్ట్రాల నుంచి గంజాయి ర‌వాణా చేస్తున్నార‌ని పోలీసులు వెల్ల‌డించారు. గ‌తంలో నాగ్‌పూర్ నుంచి ఒక వ్య‌క్తి గంజాయి ర‌వాణా చేస్తూ ప‌ట్టుబ‌డ్డ‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఎక్కువ‌గా నాగ్‌పూర్ నుంచే గంజాయి ర‌వాణా జ‌రుగుతోంద‌ని, వారం ప‌ది రోజుల‌కు ఒక‌సారి తనిఖీలు నిర్వ‌హిస్తున్నామ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>