Mobile Popup Ad
Mobile Popup Ad

ఇప్పటివరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదు: కేంద్రం

కలం, వెబ్ డెస్క్: దేశంలో ఇప్పటివరకు ఎలాంటి ఎబోలా పాజిటివ్ కేసులు (Ebola Cases) నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ముందస్తు జాగ్రత్తలు, సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా విమానాశ్రయాల్లో నిఘా, ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆఫ్రికాలోని కాంగో తూర్పు ప్రాంతంలో ఎబోలా వేరియంట్‌ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ అంటువ్యాధి బారిన పడి ఇప్పటి వరకు కనీసం 131 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 513 అనుమానిత కేసులున్నాయని చెబుతున్నారు. కాగా, ఎబోలా వేవియంట్ వ్యాప్తి, కేసులు పెరుగుతున్న తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న వైరస్ లలో ఎబోలా ఒకటి. ఇది అంటువ్యాధి కాదు, గాలి ద్వారా సోకదు. వైరస్ సోకిన వ్యక్తిని తాకడం ద్వారా కూడా ఇది ఇతరులకు సోకదు. వైరస్ సోకిన వ్యక్తిల శరీర ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా మాత్రమే ఈ వైరస్ సోకుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>