కలం, స్పోర్ట్స్ బ్యూరో: కెప్టెన్సీ అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఓటమిని ఎలా హ్యాండిల్ చేస్తారన్నది ముఖ్యమే..! వరుస ఓటముల సుడిగుండంలోనూ టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) చూపిస్తున్న ప్రశాంతత ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఈ ‘కూల్ కెప్టెన్’ చిరునవ్వు వెనుక ఉన్నది బలహీనతనా లేక ఆత్మవిశ్వాసమా? టీమిండియా ఎందుకు తడబడుతున్నది? శ్రేయాస్ మార్క్ నాయకత్వం నిజమైన “కమ్‌బ్యాక్” సంకేతమా?
సచిన్, రోహిత్ వంటి మేటి దిగ్గజాలను దేశానికి అందించిన ముంబై క్రికెట్ నడిబొడ్డున ఎదిగిన అయ్యర్‌కు .. మ్యాచ్ ప్రెజర్‌ను హ్యాండిల్ చేయడం, ఒత్తిడిని చిరునవ్వుతో జయించడం కొత్తేమీ కాదు. పైగా ఐపీఎల్లో మూడు డిఫరెంట్ ఫ్రాంచైజీలను (ఢిల్లీ, కోల్‌కతా, పంజాబ్) సక్సెస్‌ఫుల్‌గా ఫైనల్స్‌కు చేర్చిన టాప్-క్లాస్ లీడర్‌షిప్ శ్రేయస్‌ది. ముఖ్యంగా కేకేఆర్‌ను ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన ఘనత అతని సొంతం. మెగా లీగ్‌లో కెప్టెన్‌గా 100కు పైగా మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసి, 56 శాతం విన్నింగ్ రేట్‌తో 55 విక్టరీలను ఖాతాలో వేసుకున్న ఈ అద్భుతమైన కెప్టెన్సీ ప్రొఫైలే.. శ్రేయాస్ అయ్యర్‌ను టీమిండియా టీ20 కెప్టెన్సీ పీఠంపై కూర్చోబెట్టింది.
కూల్ ఆటిట్యూడ్ వెనుక చర్చ
దురదృష్టవశాత్తూ టీమిండియా ఫుల్-టైమ్ టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి శ్రేయాస్‌కు ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో భారత్ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయినా.. రెండో మ్యాచ్‌లో మరో ఘోర పరాజయం ఎదురైంది.
ఇలా వరుస డిఫీట్స్ తర్వాత సాధారణంగా ఏ కెప్టెన్ అయినా తీవ్రమైన మ్యాచ్ ప్రెజర్‌కు లోనవుతాడు. కానీ, శ్రేయాస్ మెయింటైన్ చేస్తున్న ‘కూల్ అండ్ కంపోజ్డ్’ ఆటిట్యూడ్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విమర్శకులు దీనిని రెస్పాన్సిబిలిటీ లేకపోవడంగా లేదా ఒక ‘బలహీనత’గా వేలెత్తి చూపిస్తుంటే.. క్రికెట్ పండితులు మాత్రం దీనిని అతని మైండ్ పవర్, ‘ఆత్మవిశ్వాసం’గా అభివర్ణిస్తున్నారు.
అయ్యర్ కెప్టెన్సీ ప్రత్యేకత ఇదే
ఓటమి తర్వాత ఎక్కడా సాకులు వెతకకుండా.. జట్టు వైఫల్యాలను స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అంగీకరించడం అతని కెప్టెన్సీ స్పెషాలిటీ. ఐర్లాండ్ సిరీస్‌లో పిచ్, వాతావరణ పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమయ్యామని, అలాగే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 17వ ఓవర్ మలుపు తిప్పి ఆటను మార్చేసిందని ఓపెన్‌గా అంగీకరించాడు. ఈ క్రమంలో ఏ ఒక్క ప్లేయర్‌ను తప్పుబట్టకుండా టీమ్ స్పీరిట్‌ను ప్రొటెక్ట్ చేశాడు. మైదానంలో ఆన్-ఫీల్డ్ లీడర్‌షిప్‌లోనూ అయ్యర్ అప్రోచ్ డిఫరెంట్‌గా ఉంటుంది. వికెట్ పడినప్పుడు బౌలర్లను మోటివేట్ చేయడం, ప్రత్యర్థి బ్యాటర్లు భారీ పార్డ్నర్‌షిప్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు బౌలర్లతో మాట్లాడి ప్లాన్స్ మార్చడం, యంగ్ ప్లేయర్స్‌కు మద్దతు ఇవ్వడం అతని కెప్టెన్సీలో హైలైట్‌గా నిలుస్తున్నది.
టీమిండియా తడబాటుకు కారణాలు
కెప్టెన్ ఆన్-ఫీల్డ్ మోటివేషన్, వ్యూహాత్మక మార్పులు, యువ ఆటగాళ్లకు ఇస్తున్న మద్దతు బాగున్నప్పటికీ.. కొత్త టీమిండియా తడబాటుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. కీలక క్యాచ్‌లు జారవిడవడం, డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకోవడం, ముఖ్యంగా కీలక సమయాల్లో బ్యాటింగ్ వైఫల్యాలు టీమ్ విజయాలను దెబ్బతీస్తున్నాయి.
ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లో టాప్ ఆర్డర్ బాధ్యతారాహిత్యంతో వికెట్లు పారేసుకోవడం, జట్టులో స్థిరత్వం లేకపోవడం, ప్రణాళికలను ఆచరణలో పెట్టడంలో ఆటగాళ్ల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. భారీ స్కోర్లు చేసినా.. మ్యాచ్‌పై పట్టు సాధించినా.. ఆఖరి వరకు దానిని నిలబెట్టుకోలేకపోవడం, ఫీల్డ్ సెట్టింగ్స్, బౌలింగ్ రొటేషన్‌లో పదును తగ్గడం వంటి అంశాలు పరాజయాలకు దారితీస్తున్నాయి.
బాధ్యత ఒక్కడిదే కాదు..
ఈ వైఫల్యాలను కేవలం కెప్టెన్ బాధ్యతగా చూడకుండా.. ఆటగాళ్ల వ్యక్తిగత తప్పిదాలను, జట్టు సమష్టి ప్రదర్శన లోపాలను కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు. భారత్ మళ్లీ విజయాల బాట పట్టాలంటే మిడిల్ ఓవర్లలో పటిష్టమైన భాగస్వామ్యాలు నిర్మించడం, డెత్ ఓవర్లలో కచ్చితమైన బౌలింగ్ ప్రణాళికలను అమలు చేయడం అత్యవసరం. అలాగే క్యాచ్‌లు వదిలేసే చిన్నపాటి పొరపాట్లను తగ్గించుకోవడంతో పాటు, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఫీల్డ్ వ్యూహాలను వేగంగా మార్చగలగడం ఇక్కడ అత్యంత కీలకం.
యువ కెప్టెన్‌కు అసలైన పరీక్ష
మూడు మ్యాచ్‌లు.. మూడు ఓటములు.. ఇది కేవలం కొత్త అధ్యాయానికి ఆరంభం మాత్రమే. కానీ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ సామర్థ్యాన్ని నిర్ణయించేది ఈ ఓటములు కాదు. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి అతను జట్టును మళ్లీ విజయతీరాలకు ఎలా మలుపుతిప్పుతాడన్నదే ముఖ్యం. ముఖంలో చిరునవ్వు చెదరకుండా ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ యువ కెప్టెన్ ముందు.. విమర్శకులకు సమాధానమిచ్చి జట్టును గాడిలో పెట్టాల్సిన నిజమైన పరీక్ష ఇప్పుడు అయ్యర్ ఎదురుగా ఉంది.

