భోపాల్‌లో ‘పెద్ది’ గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్‌

కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పెద్ది” (Peddi). ప్రేక్షకులలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ‘పెద్ది’ గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ దేశ వ్యాప్తంగా భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇటీవల ముంబైలో నిర్వహించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ బాగా సక్సెస్ అయింది. ట్రైలర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారీ మ్యూజికల్ ఈవెంట్‌కు పెద్ది టీం సిద్ధమైంది. ‘పెద్ది కీ ఆవాజ్’ పేరుతో నిర్వహించనున్న ఈ ఈవెంట్‌కు సినీ, సంగీత అభిమానులలో  భారీ ఆసక్తి నెలకొంది.

ఈ కార్యక్రమం BHEL దసరా మైదాన్‌లో మే 23న సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ వేడుకలో ప్రముఖ సంగీత దర్శకుడు  ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఈ వేదికపై పెద్ది స్పెషల్ సాంగ్ రిలీజ్ కానుంది.  ఈ ఈవెంట్ ద్వారా పెద్ది  ప్రమోషనల్ కార్యక్రమాలు మరింత వేగం అందుకోనున్నాయి. ఈ ఈవెంట్‌కు భారీ స్థాయిలో అభిమానులు హాజరవుతారని అంచనా వేయగా, భోపాల్‌లో ఇప్పటికే ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>