అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య.. సిద్దిపేటలో విషాదం

కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట (Siddipet) జిల్లా జగదేవ్‌పూర్ (Jagdevpur) మండలం వట్టిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారంతో వెంకటేష్ (30) అనే యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం ప్రకారం, వెంకటేష్ ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేశాడు. అయితే ఈ ఏడాది పంట దిగుబడి సరిగా రాకపోవడంతో ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నది. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మనస్తాపానికి లోనై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు వెంకటేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>