కలం వెబ్ డెస్క్ : నేషనల్ హెరాల్డ్(National Herald) మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో పాటు మరో ఐదుగురికి ఢిల్లీ హైకోర్ట్(Delhi High Court) నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ట్రయల్ కోర్ట్ అభియోగాలను స్వీకరించేందుకు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఈడీ(ED) హైకోర్ట్ ను ఆశ్రయించింది. నిందితులు కేవలం రూ.50 లక్షల వ్యయంతో సుమారు రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను దక్కించుకున్నారని ఈడీ ఆరోపించింది. ట్రయల్ కోర్ట్ నిర్ణయంపై పునః పరిశీలన అవసరమని ఈడీ అభిప్రాయపడింది. ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్ట్ విచారణ చేపట్టి ఆయా నేతలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 12వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఈ పరిణామం దేశ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
Read Also: వందేండ్లు గడిచినా మరవలేని మేధావి రామానుజన్.. నేడు జాతీయ గణిత దినోత్సవం
Follow Us On: Sharechat


