కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దీనదయాళ్ అంత్యోదయం యోజన (DAY), జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM) పథకం కింద రూ. 207 కోట్లను రిలీజ్ చేసింది. ఈ మేరకు 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఈ నిధులు మంజూరు చేసింది.
ఈ నిధుల విడుదల పై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులు స్వయం సహాయక సంఘాల బలోపేతానకి ఉపయోగపడతాయని చెప్పారు. మహిళలకు ఆర్థిక స్వావలంబనను పెంపొందించి, కుటుంబాల ఆదాయ స్థాయిని మెరుగుపరుస్తాయని వెల్లడించారు. ఈ నిధులలో ప్రతి రూపాయి మహిళా శక్తికి బలమైన నాంది, ఆత్మ నిర్భర ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి దృఢమైన అడుగు అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

