Mobile Popup Ad
Mobile Popup Ad

రఫ్ఫాడించిన రికెల్టన్.. ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ 244

కలం, వెబ్ డెస్క్: వాంఖడేలో ముంబై ఇండియన్స్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ (Ryan Rickelton)  చితకొట్టాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆరంభం నుంచే ముంబై బ్యాటర్లు.. ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. విల్ జాక్స్.. అద్భుతమైన ఊపును అందించాడు. రికెల్టన్ దానికి ఇంకో లెవెల్‌కి తీసుకెళ్లాడు. కానీ ఈ మ్యాచ్‌లో కూడా సూర్యకుమార్ యాదవ్ అభిమానులను నిరుత్సాహపరిచాడు. కేవలం ఐదు పరుగులు చేసి క్యాచ్ ఔట్ అయి పెవిలియన్ బాటపట్టాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు మరోసారి పేలవమైన ప్రదర్శన కనబరిచారు. ఇషాన్ మలింగ మినహా మిగిలిన వారు ఎవరూ కూడా కట్టడి అన్న విషయాన్నే మర్చిపోయి పరుగులు సమర్పించుకున్నారు. హర్ష్ దుబేను ముంబై బ్యాటర్లు వీర ఉతుకుడు ఉతికారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ తొలి బంతి నుంచే ఊచకోత ప్రారంభించింది. ఓపెనర్స్‌లో విల్ జాక్స్ 22 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేసి వెనుదిరిగాడు. రెండో ఓపెనర్ రికెల్టన్ మాత్రం మ్యాచ్‌ను నిలబెట్టే ఇన్నింగ్స్ ఆడాడు. 55 బంతుల్లో 123 పరుగులతో మెరిశాడు. సూర్యుమార్ యాదవ్ 5 బంతుల్లో 5 పరుగులు, నమన్ దిర్ 17 బంతుల్లో 22 పరుగులు చేసి వెనుదిరిగారు. హార్దిక్ పాండ్యా 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 5 బంతుల్లో 7 పరుగుల చేసి హింగే బౌలింగ్‌లో వికెట్ కోల్పోయాడు. లాస్ట్‌లో మైదానంలోకి వచ్చిన రోబిన్ 1 బంతికి 1 పరుగు చేశాడు. మొత్తానికి నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది.

బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 39 పరుగులు సమర్పించుకున్నాడు. ఇషాన్ మలింగ్ 4 ఓవర్లకు 29 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టాడు. హర్ష్ దుబే 3ఓవర్లకు 50 పరుగులిచ్చాడు. షాకిబ్ హుస్పసేన్ 3 ఓవర్లకు 39 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీశాడు. నితీష్ రెడ్డి 2ఓవర్లకు 31 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీశాడు. ప్రఫుల్ హింగే 4 ఓవర్లు బౌలింగ్ చేసి 54 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ల ముందు 244 పరుగుల భారీ లక్ష్యం ఉంది. దానిని ఏ రేంజ్‌లో ఛేదిస్తారో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>