ఎబోలా వైరస్‌పై కేంద్రం అలర్ట్.. ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు

కలం, వెబ్ డెస్క్: ఆఫ్రికాను గడగడలాడిస్తున్న ఎబోలా వైరస్‌పై (Ebola Virus) కేంద్రం మరింత అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్‌పోర్టు, ఓడరేవుల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరీ ముఖ్యంగా, కాంగో, ఉగాండా, సుడాన్ దేశాల నుంచి వస్తున్నవారిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి, పటిష్టమైన స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఎబోలా సోకినవారికి జ్వరం, నీరసం, అలసట, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, విరేచనాలు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయని, ఎట్టి పరిస్థితుల్లో తేలిగ్గా తీసుకోవద్దని వార్నింగ్ ఇచ్చింది.

భారత్-ఆఫ్రికా ఫోరమ్ సదస్సు వాయిదా..

ఎబోలా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు దిల్లీలో జరగాల్సిన భారత్-ఆఫ్రికా ఫోరమ్ సదస్సు వాయిదా వేస్తున్నట్ల కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. ఈ సదస్సుకు ఆఫ్రికా దేశాల నేతలే హాజరు కాబోతున్న నేపథ్యంలో, అక్కడి పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>