కలం, వెబ్ డెస్క్: సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడంపై చాలా మందికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ అంశాల మీద పుకార్లు షికార్లు చేస్తుంటాయి. చాలా సందర్భాల్లో అవాస్తవాలే ప్రచారం అవుతూ ఉంటాయి. తాజాగా నటి మీనాక్షి చౌదరిపై (Meenakshi Chaudhary)ప్రేమ, పెళ్లి వ్యవహారంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఆ వార్తలకు ఆమె ఫుల్ స్టాప్ పెట్టింది. ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి . ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా.. మీనాక్షికి వరుసగా అవకాశాలు తలుపుతట్టాయి. అడవి శేష్‌తో హిట్ 2, సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో గుంటూరు కారం, విక్టరీ వెంకటేశ్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాల్లో నటించి మెప్పించింది. బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే.. ఈ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న మీనాక్షికి పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురైంది.
పెళ్లి కానీ హీరో, హీరోయిన్స్‌కి ఎదురయ్యే ప్రశ్నే ఇది. దీనికి ఈ అమ్మడు టైమ్ వచ్చినప్పుడు చెప్తా అని చెప్పింది. ఈ మధ్య కాలంలో మీనాక్షి లవ్‌లో ఉందని.. అది కూడా ఎవరితోనే కాదు.. అక్కినేని ఫ్యామిలీ హీరో, తన మొదటి సినిమా హీరో సుశాంత్‌తో అంటూ ప్రచారం జరిగింది. వీరిద్దరూ కలిసి నటించినప్పటి నుంచి డేటింగ్‌లో ఉన్నారని.. వీరిద్దరూ కూడా త్వరలో పెళ్లి కబురు చెబుతారని పుకార్లు షికారు చేసాయి. ఈ గాసిప్ నిజమేనేమో.. త్వరలో శుభవార్త చెబుతారేమో అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయ్యింది.
ఈ వార్తల్లో వాస్తవం లేదని సుశాంత్, మీనాక్షి ఆమధ్య ఖండించారు. అయినా అప్పుడప్పుడు ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం మీనాక్షి అనగనగా ఒక రాజు అనే సినిమాతో సంక్రాంతికి వస్తుంది. అలాగే యువసమ్రాట్ నాగచైతన్యకు జంటగా వృషకర్మ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ అమ్మడు ఫామ్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంటుందా? లేక సినిమా ఆఫర్స్ తగ్గినప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తుందా? ఇంతకీ.. ముద్దుగుమ్మ మీనాక్షి (Meenakshi Chaudhary) మనసులో ఎవరున్నారో?.
Read Also: టాక్సిక్‌లో నయన్ స్టన్నింగ్ లుక్.. యశ్ మూవీకి మరింత హీట్!
Follow Us On: Pinterest


