కలం, వెబ్ డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) సంచలన నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని ఫల్టా అసెంబ్లీ నియోజకవర్గంలో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. మే 21వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మొత్తం 285 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
అదే కారణమా..?
బెంగాల్ రెండో విడత పోలింగ్‌లో భాగంగా ఫల్టా అసెంబ్లీ నియోజకవర్గానికి గత నెల 29న ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో.. అక్కడ అనేక అక్రమాలు జరిగినట్లు ఈసీ అధికారులు గుర్తించారు. ప్రజాస్వామ్యయుతంగా అక్కడ పోలింగ్ జరగలేదని అందుకే, ఎన్నికల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండేందుకు గాను మరోసారి అక్కడ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఈసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

