స్వైటెక్‌కు గడ్డుకాలం.. మాజీ ఆటగాళ్ల హెచ్చరిక!

క‌లం, వెబ్‌డెస్క్‌: ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ ఇగా స్వైటెక్ (Iga Swiatek) ఫామ్‌పై ఇప్పుడు క్రీడా లోకంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా మాడ్రిడ్ ఓపెన్ మూడో రౌండ్‌లో అనారోగ్యం కారణంగా ఆమె మధ్యలోనే తప్పుకోవడమే ఈ చర్చకు కారణం. యాన్ లీతో జరిగిన ఈ మ్యాచ్‌లో వెనుకబడి ఉన్న సమయంలో స్వైటెక్ రిటైర్ అయ్యారు. 2026 సీజన్ ఆమెకు ఏమాత్రం కలిసిరావడం లేదు. ముఖ్యంగా ఫ్రెంచ్ ఓపెన్ సమీపిస్తున్న తరుణంలో ఆమె ఫామ్ కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై మాజీ క్రీడాకారులు సామ్ క్వెరీ, స్టీవ్ జాన్సన్ ఒక పాడ్‌కాస్ట్‌లో ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం అత్యుత్తమంగా ఆడుతున్న ఐదుగురు క్లే కోర్ట్ ప్లేయర్లలో స్వైటెక్‌కు చోటు లేదని సామ్ క్వెరీ కుండబద్దలు కొట్టారు. గత ఐదేళ్లుగా ఆమె అగ్రస్థానంలో ఉన్న మాట వాస్తవమే అయినా, ప్రస్తుతం ఆమెలో ఆ పాత ఆత్మవిశ్వాసం కనిపించడం లేదని ఆయన విశ్లేషించారు.

స్టీవ్ జాన్సన్ సైతం దీనిపై స్పందిస్తూ, ఈ వారం ఫలితం తర్వాత తాను కూడా స్వైటెక్ విషయంలో ఆందోళన చెందుతున్నానని, ఆమె ఆటతీరుపై ‘పానిక్ బటన్’ నొక్కాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. మరోవైపు తన పరిస్థితిపై స్వైటెక్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తన ప్రదర్శనపై పూర్తి నియంత్రణ లేకపోవడం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యం కారణంగా ఇబ్బంది పడ్డానని, ప్రస్తుతం కొంచెం కోలుకుంటున్నట్లు ఆమె తెలిపారు. వచ్చే రెండు రోజుల్లో పూర్తి ఫిట్‌నెస్ సాధించి, మళ్లీ కష్టపడతానని అభిమానులకు మాట ఇచ్చారు. రోమ్‌లో జరగబోయే ఇటాలియన్ ఓపెన్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే మే 6 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్‌లోనైనా ఆమె మునుపటి ఫామ్ అందుకుంటుందో లేదో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>