Mobile Popup Ad
Mobile Popup Ad

జన గణన మ్యాపింగ్ సెన్సెస్ నంబర్ కేటాయింపు ప్రక్రియ ప్రారంభం

కలం, నిజామాబాద్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనాభా జనగణన (Census)కు సంబంధించి మ్యాపింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. నిజామాబాద్ (Nizamabad), కామారెడ్డి (Kamareddy) రెండు జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో బృందాలు ఆ ప్రక్రియ చేపట్టాయి.. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 46, 47 వార్డులలో ప్రభుత్వం కేటాయించిన సూపర్ వైజర్ ఎన్యూమరేటర్లకు 46, 47 వార్డులను ( 7 ) ఏడు బ్లాకులుగా విభజించి ఒక్కో బ్లాకుకు దాదాపు గా 100 ఇండ్ల నంబర్లు కేటాయించి ఒక బ్లాక్ కు ఒక ఎన్యూమరేటర్‌ను కేటాయించారు. ఇంటింటికి తిరుగుతూ అ ఇంటి నంబర్ పై ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయో గుర్తించి వారికి సెన్సెస్ (CN) నంబర్ కేటాయించడం జరిగింది. ఈ జనగణన కార్యక్రమంలో 46, 47వ వార్డుల కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న – లక్ష్మినారాయణ, జనగణన టీం సూపర్ వైజర్ నారాయణ, ఎన్యూమరెటర్లు జ్యోతి, సౌందర్య, ప్రియాంక, రాధికా, రేణుకా, శరణ్య కుమారి, హేమలత, 46, 47 వార్డుల అధికారి కిశోర్ వార్డు అసిస్టెంట్లు బాల్ రాజ్, నర్సింలు, వాటర్ మెన్‌లు రాజు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>